ఇండియన్ స్క్రీన్‌పై మొట్టమొదటి సారిగా ఒకే ఒక్క క్యారెక్టర్ తో ఎడిటింగ్ లేకుండా ఉత్కంఠ భరితంగా సాగిపోయే కథ కధనంతో తెరకెక్కిన చిత్రం “105 మినిట్స్”. హన్సిక మోత్వాని కథానాయికగా, రాజు దుస్సా దర్శకత్వంలో, రుధ్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకంపై బొమ్మక్ శివ నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమయ్యింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.
దర్శకుడు రాజు దుస్సా మాట్లాడుతూ మేము ముందుగా అనుకున్న కాన్సెప్ట్ ను ఉన్నది ఉన్నట్టుగా చక్కాగా తీశామని, అన్ని విభాగాల్లో నాకు రవి గారు చాలా సపోర్ట్ చేశారని, ఆయనకు చాలా థాంక్స్ అని అన్నారు. హన్సిక గారి గురించి చెప్పాలంటే తాను డే వన్ నుండి షూటింగ్ అయిపోయే వరకు తను చాలా కష్టపడింది. మేము సింగల్ షార్ట్ లో చేస్తే హన్సిక గారు ప్రతి షార్ట్ సింగల్ టేక్ లో చేశారు. అలా చేసినందుకే సినిమా తొందరగా పూర్తి చేశామని, యూనిట్ సభ్యులందరు చాలా సపోర్ట్ చేశారని అన్నారు.
హీరోయిన్ హన్సిక మోత్వాని మాట్లాడుతూ నా ప్రతి సినిమాకు ఎంతో సపోర్ట్ చేస్తూ ప్రోత్సహిస్తున్న తెలుగు ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. నా కెరీర్లో ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నింటిలోకి ఈ సినిమా చాలా టప్ గా అనిపించిందని అన్నారు. దర్శకుడు, నిర్మాతలు మంచి కథను సెలెక్ట్ చేసుకొని ఎక్సపెరర్మెంటల్గా తీశారని అన్నారు. టీం అంతా ఈ సినిమా కోసం చాలా కష్టపడి పని చేశారని, ఖచితంగా ఈ సినిమా గొప్ప విజయం సాధించి దర్శక, నిర్మాతలకు, చిత్ర యూనిట్‌కు మంచి పేరు తీసుకురావాలని తాను కోరుకుంటున్నానని అన్నారు.
నిర్మాత బొమ్మక్ శివ మాట్లాడుతూ మంచి కాన్సెప్ట్ ఉన్న కథను సెలెక్ట్ చేసుకున్న మేము ఇంత తొందరగా సినిమా షూట్ పూర్తి చేస్తామని అనుకోలేదని, చిత్ర యూనిట్ అందరూ కూడా ఎంతో డెడికేటెడ్‌గా వర్క్ చేశారని, ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేసిన హన్సిక స్టార్ హీరోయిన్ అయ్యి ఉండి కూడా తను ఎంతో డెడికేటెడ్‌గా దర్శకుడు చెప్పిన ప్రతి షార్ట్ కూడా సింగల్ టేక్‌లో చేయడం వలన మేము ఈ సినిమాను కేవలం ఆరు రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేశామని, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని, మా ఈ “105 మినిట్స్” చిత్రం ప్రేక్షకులందరికీ తప్పకుండా నచ్చుతుందని అన్నారు.


