ఫిబ్రవరి 23న ప్రపంచ వ్యాప్తంగా “14డేస్ లవ్” విడుదల

ఫిబ్రవరి 23న ప్రపంచ వ్యాప్తంగా “14డేస్ లవ్” విడుదల

Published on Feb 21, 2024 10:39 AM IST

14 days love

సుప్రియ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై హరిబాబు దాసరి నిర్మాతగా అఖిల్ అండ్ నిఖిల్ సమర్పణలో నాగరాజు బోడెం దర్శకత్వంలో నిర్మించిన యూత్ ఫుల్ అండ్ కుటుంబ కథా చిత్రం 14 డేస్ లవ్. అత్యధిక థియేటర్లలో విడుదల అవుతున్న ఈ చిత్రంలో మనోజ్ పుట్టూర్, చాందిని భాగవని హీరో హీరోయిన్లు గా నటించారు. రాజా రవీంద్ర, సనా సునూర్ కీలక పాత్రలు పోషించగా, అంజలి, ఐడ్రీమ్ రాజా శ్రీధర్ తదితరులు నటించారు.

కుటుంబ విలువల్ని కాపాడే ప్రయత్నంలో ఆ ఇంటి వారసులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి వారి మధ్య చిగురించిన ప్రేమకు ఎలాంటి ముగింపు దొరికింది అన్న కోణంలో దర్శకుడు నాగరాజు బోడెం అత్యంత ఆసక్తికరంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సంప్రదాయ విలువలున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఫిబ్రవరి 23న విడుదల అవుతుంది.

తాజా వార్తలు