కేజీఎఫ్ 2 నుండి విడుదల అయిన మదర్ సాంగ్ కి విశేష స్పందన!

Published on Apr 8, 2022 6:44 pm IST

యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రం థియేటర్ల లో భారీ విడుదల కి సిద్దం అవుతోంది. ఊహించని విధంగా ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి పార్ట్ సెన్సేషన్ క్రియేట్ చేయడం తో రెండవ పార్ట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి భారీ రెస్పాన్స్ వస్తోంది.

ఈ చిత్రం నుండి విడుదల అయిన మదర్ సెంటిమెంట్ సాంగ్ కి విశేష స్పందన లభిస్తోంది. అన్ని బాషల్లో ఈ పాటకి 14 మిలియన్స్ కి పైగా వ్యూస్ రావడం విశేషం. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం లో శ్రీ నిధి హీరోయిన్ గా నటించింది. సంజయ్ దత్, రవీనా టాండన్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :