వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్ చేసుకున్న “18 పేజెస్”

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్ చేసుకున్న “18 పేజెస్”

Published on Apr 16, 2023 2:31 PM IST

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా, బబ్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం 18 పేజెస్. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద డీసెంట్ పెర్ఫార్మెన్స్ ను చూపించిన ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది.

ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఏప్రిల్ 23 వ తేదీన (ఆదివారం) సాయంత్రం 6:30 గంటలకు జీ తెలుగు లో ప్రసారం కానుంది. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించారు. GA2 పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లపై నిర్మించిన ఈ చిత్రం కి బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు