ఏపీ &తెలంగాణలో 2.0 మూడు రోజుల కలక్షన్ల వివరాలు !

Published on Dec 2, 2018 3:35 pm IST

సూపర్ స్టార్ రజినీ కాంత్ -శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన విజువల్ వండర్ 2.0 రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లను రాబడుతుంది. ఈచిత్రం మూడు రోజులకు గాను ఏపీ మరియు తెలంగాణ లో 24.87కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ రోజు 8 నుండి 9కోట్ల వరకు రాబట్టే అవకాశం వుంది.

ఇక ఈ చిత్ర తమిళ వెర్షన్ చెన్నై లో 3వరోజు కూడా 2.57 కోట్ల గ్రాస్ ను రాబట్టి అక్కడ ఈ రోజుతో 10కోట్ల క్లబ్ లో చేరనుంది. 3రోజుల్లో అక్కడ ఈచిత్రం 7.34 కోట్ల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసింది.

ఏపీ &తెలంగాణలోఈచిత్రం యొక్క మూడు రోజుల కలక్షన్ల వివరాలు :

 

ఏరియా కలక్షన్స్
నైజాం 10.34 కోట్లు
సీడెడ్ 3.71 కోట్లు
నెల్లూరు 1.11 కోట్లు
గుంటూరు 1.87కోట్లు
కృష్ణా 1.42కోట్లు
పశ్చిమ గోదావరి 1.32కోట్లు
తూర్పు గోదావరి 1.85 కోట్లు
ఉత్తరాంధ్ర 3.25 కోట్లు
ఏపీ, తెలంగాణ లో మూడు రోజుల షేర్ 24.87 కోట్లు

సంబంధిత సమాచారం :