నేను మిక్స్డ్ బ్రీడ్.. సీనియర్ హీరోయిన్ కామెంట్స్ వైరల్ !

నేను మిక్స్డ్ బ్రీడ్.. సీనియర్ హీరోయిన్ కామెంట్స్ వైరల్ !

Published on Mar 24, 2026 1:26 AM IST

rassi

సీనియర్ హీరోయిన్ రాశి చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన సినీ కెరీర్ ను స్టార్ట్ చేశారు. ఆ తర్వాత తెలుగు, తమిళ ఇతర భాషల్లో దాదాపు 300 పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. పైగా 14 ఏళ్ల వయసులోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. స్టార్‌లతో నటించింది రాశి. కాగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాశి తన సినీ కెరీర్ గురించి, పర్సనల్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ, రాశి ఏం మాట్లాడారో ఆమె మాటల్లోనే విందాం.

రాశి మాట్లాడుతూ.. ‘నేను పుట్టిపెరిగింది ఇండస్ట్రీలోనే. నన్ను హీరోయిన్‌ని చేయాలని మా నాన్న చాలా తపన పడ్డారు. ఆయన కారణంగానే హీరోయిన్ అయ్యాను. ఇక పర్సనల్‌గా ప్రేయసిరావే సినిమా అంటే నాకు ఒక గొప్ప ఎమోషన్. ఆ సినిమాని ఎవరు మర్చిపోయినా నేను మర్చిపోలేను. మా నాన్న చివరిగా చూసిన సినిమా కూడా ప్రేయసిరావే. అందుకే ఆ సినిమా నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అని రాశి చెప్పుకొచ్చారు.

రాశి ఇంకా మాట్లాడుతూ.. ‘నేను అప్పట్లో లావుగా ఉన్నానని అనేవారు. నిజానికి నేను పెళ్లి చేసుకోవడానికే లావు అయ్యాను. పైగా నేను 22 ఏళ్లకే పెళ్లి చేసుకున్నా. అయినా, నేను ఇలా కనిపించడానికి కారణం.. నేను మిక్స్డ్ బ్రీడ్. నాన్న బ్రాహ్మిణ్. అమ్మ గౌడ. నాన్న కులమే వర్తిస్తుంది కాబట్టి నేను బ్రాహ్మిణ్ అయ్యాను’ అని రాశి తెలిపారు.

తాజా వార్తలు