తెలుగు రాష్ట్రాల్లో 2.0 ఐదు రోజుల కలక్షన్స్ !

Published on Dec 4, 2018 12:00 pm IST

సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన ‘2.0’ రెండు తెలుగు రాష్ట్రాల్లో సోమవారం 3కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ఈచిత్రం 5 రోజులకు గాను ఏపీ మరియు తెలంగాణ లో 36.35కోట్ల షేర్ వసూళ్లను కలెక్ట్ చేసింది. అయితే ఈ చిత్రం ఆక్కడ 70కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా మరి ఆ మొత్తాన్ని రాబట్టాలంటే మరో మూడు వారాలు ఇదే రన్ ను కొనసాగించాల్సి వుంది. అయితే తెలుగులో ఇప్పట్లో పెద్ద సినిమాల విడుదల లేకపోవడం ఈ చిత్రానికి అడ్వాంటేజ్ కానుంది.

ఇక ఈచిత్రం తమిళ నాడులో 5రోజుల్లో 66కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని సమాచారం. శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ , అమీ జాక్సన్ ముఖ్య పాత్రల్లో నటించారు.

ఏపీ &తెలంగాణలోఈచిత్రం యొక్క ఐదు రోజుల కలక్షన్ల వివరాలు :

 

ఏరియా కలక్షన్స్
నైజాం 15.08 కోట్లు
సీడెడ్ 5.68 కోట్లు
నెల్లూరు 1.45 కోట్లు
గుంటూరు 2.76కోట్లు
కృష్ణా 2.17కోట్లు
పశ్చిమ గోదావరి 1.85కోట్లు
తూర్పు గోదావరి 2.69 కోట్లు
ఉత్తరాంధ్ర 4.67 కోట్లు
ఏపీ, తెలంగాణ లో ఐదు రోజుల షేర్ 36.35 కోట్లు

సంబంధిత సమాచారం :