బాహుబలి కలక్షన్స్ ను క్రాస్ చేసిన 2.0 హిందీ వర్షన్ !

Published on Dec 5, 2018 8:55 am IST


సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన విజువల్ వండర్ 2.0 ఇటీవల విడుదలై బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ చిత్రానికి అన్ని భాషల్లో వేరే చిత్రాల నుండి పోటీ లేకపోవడంతో బాక్సాఫిస్ వద్ద హావ కొనసాగిస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రం అటు బాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టిస్తుంది. కేవలం 6 రోజుల్లో అక్కడ 120 షేర్ ను రాబట్టి బాహుబలి కలెక్షన్స్ ను క్రాస్ చేసింది. ఇంతకుముందు బాహుబలి ఫుల్ రన్ లో అక్కడ 117 కోట్ల షేర్ ను రాబట్టింది.

అయితే 2.0 ఫుల్ రన్ లో బాహుబలి 2 హిందీ వర్షన్ కలెక్షన్స్ దాటడం అసాధ్యమే. ఎందుకంటె ఆ చిత్రం ఏకంగా 511 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఇక 2.0 ప్రపంచ వ్యాప్తంగా 5 రోజులకుగాను దేశవ్యాప్తంగా 337 కోట్లు అలాగే ఓవర్సీస్ లో 114కోట్లు కలుపుకొని ప్రపంచ వ్యాప్తంగా 451 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

సంబంధిత సమాచారం :

X
More