200కోట్లకు చేరువైన 2.0 హిందీ వర్షన్ !

200కోట్లకు చేరువైన 2.0 హిందీ వర్షన్ !

Published on Dec 16, 2018 11:35 PM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘2.0’ ఇటీవల విడుదలై ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 700 కోట్ల ఫై చిలుకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది . ముఖ్యంగా ఈచిత్రం బాలీవుడ్ లో అద్భుతమైన లాభాలను రాబట్టింది. మూడవ వారంలోకి ప్రవేశించిన అక్కడ మంచి వసూళ్లను రాబడుతుంది. 17రోజులకు గాను ఈ చిత్రం 182.50 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. దాంతో బాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన రెండవ డబ్బింగ్ చిత్రం గా రికార్డు క్రియేట్ చేసింది. ఇంతకుముందు బాహుబలి అక్కడ 550కోట్ల వసూళ్లను రాబట్టి అల్ టైం రికార్డు ను సృష్టించింది. హిందీ లో ఈ రెండు చిత్రాలను బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహారే విడుదల చేయడం విశేషం.

ఇక 2.0 అటు కేరళలోకూడా ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది. అక్కడ ఈచిత్రం 17రోజులకుగాను 21కోట్ల గ్రాస్ ను రాబట్టి మెర్సల్ (20కోట్లు) రికార్డును బ్రేక్ చేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు