500 కోట్ల కు చేరువైన 2.0 !

500 కోట్ల కు చేరువైన 2.0 !

Published on Dec 5, 2018 3:22 PM IST

robo 2.0

సూపర్ స్టార్ రజినీకాంత్ , అక్షయ్ కుమార్ , శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘2.0’. నవంబర్ 29న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫిస్ వద్ద మొదటి నాలుగు రోజులు రికార్డు కలెక్షన్స్ రాబట్టగా తరువాతి రెండు రోజులు కొంచెం నెమ్మదించింది. ఇక ఈ చిత్రం దేశవ్యాప్తంగా 367 కోట్లు అలాగే ఓవెర్సిస్ లో 121 కోట్ల గ్రాస్ కలుపుకొని 6 రోజులకుగాను ప్రపంచ వ్యాప్తంగా 488కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఇక ఈ చిత్రం కేరళ లో సర్కార్ ( 14.1కోట్లు )వసూళ్లను క్రాస్ చేసి అక్కడ అత్యధిక వసూళ్లను రాబట్టిన డబ్బింగ్ సినిమా గా రికార్డు సృష్టించింది. భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈచిత్రం చైనా లో వచ్చే ఏడాది మే నెలలో సుమారు పదివేల థియేటర్లలో విడుదల కానుంది. ఇదిలావుంటే ఇటీవల వరుస పరాజయాలతో డీలా పడ్డ తలైవా రజినీ కాంత్ ఈ చిత్రం తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కి బాక్సాఫిస్ వద్ద తన సత్తా చూపెడుతున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు