మంచి ధరకు అమ్ముడైన ‘రోబో -2’ తెలుగు హక్కులు !
Published on Aug 10, 2017 12:18 pm IST


దక్షిణాది ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘రోబో 2’. సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్ ల కలయికలో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లో కూడా భారీ అంచనాలున్నాయి. ఈ క్రేజ్ వలనే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా తారా స్థాయిలో జరుగుతోంది. తాజాగా ఈ చిత్ర తెలుగు హక్కులు కూడా మంచి ధరకు అమ్ముడైనట్టు తెలుస్తోంది. చి

గ్లోబల్ సినిమా ఏపి, తెలంగాణా హక్కుల్నిసొంతం చేసుకుందని చిత్ర నిర్మాతల్లో ఒకరైన రాజు మహాలింగం తెలిపారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ కుమార్ నెగెటివ్ రోల్ చేస్తుండగా అమీ జాక్షన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని 2018 జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.

 
Like us on Facebook