శ్రీదేవి సోడా సెంటర్ ట్రైలర్ కి వస్తున్న భారీ రెస్పాన్స్…2 మిలియన్ కి పైగా వ్యూస్!

Published on Aug 19, 2021 3:13 pm IST

సుధీర్ బాబు హీరోగా, ఆనంది హీరోయిన్ గా కరుణ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. ఈ చిత్రం థియేట్రికల్ విడుదల కి సిద్దం అవుతోంది. ఆగస్ట్ 27 వ తేదీన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ చిత్రం ను 70 ఎంఎం ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా మరియు శశి దేవిరెడ్డి లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ ను తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నేడు విడుదల చేయడం జరిగింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల అయిన ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ వస్తోంది. సుధీర్ బాబు మొదటి సారి గా డిఫెరెంట్ జోనర్ లో చిత్రం చేస్తూ ఉండటం మాత్రమే కాకుండా, మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల కావడం తో ట్రైలర్ మి భారీ వ్యూస్ వస్తున్నాయి. గడిచిన నాలుగు గంటల లోపే ఈ చిత్రం ట్రైలర్ 2 మిలియన్ వ్యూస్ కి పైగా సొంతం చేసుకుంది. 100కే కి పైగా లైక్స్ రావడం విశేషం. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం మరొక హైలెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :