త్వరలో ప్రారంభంకానున్న 2 స్టేట్స్ తెలుగు రీమేక్ !
Published on Mar 13, 2018 6:21 pm IST

బాలీవుడ్లో సూపర్ హిట్ చిత్రం ‘2 స్టేట్స్’ కు తెలుగు రీమేక్ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ రీమేక్ ను నూతన దర్శకుడు వెంకట్ రెడ్డి తెరకెక్కించనున్నాడు. అయితే ఇది పూర్తిగా హిందీ సినిమాకు అనువాదంలా ఉండదట. తెలుగు నేటివిటీకి తగ్గట్టు మాఱుపు ఉంటాయట. ఈ కథ రెండు వేరు వేరు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు కాకుండా రెండు భిన్నమైన మైండ్ సెట్స్ ఉన్న వ్యక్తుల మధ్య కథలా, కొత్తగా ఉంటుందట.

అడివి శేష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో డా. రాజశేఖర్, జీవితల కుమార్తె శివాని కథానాయకిగా నటించనుంది. ఎం.ఎల్.వి.సత్య నారాయణ నిర్మించనున్న ఈ చిత్రం మార్చి 24న అధికారికంగా లాంచ్ కానుందట. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి టైటిల్ ఇంకా నిర్ణయింపబడలేదు.

 
Like us on Facebook