డ్రగ్స్ వ్యవహారంలో ముగ్గురు హీరోయిన్లకు నోటీసులు !
Published on Jul 13, 2017 3:40 pm IST


డ్రగ్స్ వాడకం వ్యవహారం టాలీవుడ్ పరిశ్రమను ఊపేస్తోంది. నిన్న పరిశ్రమ పెద్దలంతా కలిసి ప్రెస్ మీట్ పెట్టి టాలీవుడ్లో డ్రగ్స్ మాఫియా నడుస్తోందని, కేవలం కొందరి వ్యక్తుల వలన మొత్తం ఇండస్ట్రీకే చెడ్డ పేరు వస్తోందని, ఎవరెవరు డ్రగ్స్ వాడుతున్నారో తమ దగ్గర వివరాలున్నాయని, ఇకనైన అలాంటివి మానాలని హెచ్చరించారు. మరోవైపు సినిమా వాళ్లపై గట్టిగా నిఘా ఉంచిన ఏక్సయిజ్ శాఖ డైరెక్టర్ అకున్ శుభర్వాల్ ఈరోజు ముగ్గరు హీరోయిన్లకు నోటీసులు పంపారు.

అందులో వారట 19వ తేదీన విచారణకు హాజరుకావాలని తెలియజేశారు. ఇకపోతే నిన్న ముగ్గురు హీరోలకు, నలుగురు నిర్మాతలకు, ఇద్దరు డైరెక్టర్లకు, ఒక స్టంట్ కొరియోగ్రాఫర్ కు విచారణకు హాజరవ్వాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. ఇలా ఒకరి తర్వాత ఒకరుగా పేర్లు బయటికొస్తుండటంతో ఇంకా కొందరు వ్యక్తులకి ఈ వ్యవహారంతో సంబంధాలున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook