3 మిలియన్ వ్యూస్ సాధించిన “సోసోగా” సాంగ్

Published on Aug 18, 2021 3:01 pm IST


డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా, మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం మంచి రోజులు వచ్చాయి. ఈ చిత్రం నుండి సో సో గా అనే లిరికల్ వీడియో సాంగ్ విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ పాట కి యూత్ నుండి విశేషం గా స్పందన వస్తోంది. ఈ పాట ప్రస్తుతం 3 మిలియన్ ప్లస్ వ్యూస్ తో దూసుకు పోతుంది. ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ పాట యూ ట్యూబ్ లో ట్రెండ్ అవుతుండటం మాత్రమే కాకుండా సినిమా పై ఆసక్తి రేకెత్తించే విధంగా ఉందని చెప్పాలి.

ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని యూ వి కాన్సెప్ట్స్ మరియు మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వి. సెల్యులాయిడ్ మరియు ఎస్ కే ఎన్ లు నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు.

పాట చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :