ఒక్క రోజులోనే 3 మిలియన్ వ్యూస్ ను సాధించిన డీజే టిల్లు టీజర్!

Published on Sep 7, 2021 9:42 pm IST

సిద్దు, నేహా హీరో హీరోయిన్ లుగా నటిస్తూ విమల్ కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం డీజే టిల్లు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను నిన్న విడుదల చేయడం జరిగింది. లవ్ హిమ్, హేట్ హిమ్, బట్ యూ కాంట్ ఇగ్నోర్ హిమ్ అంటూ హీరో క్యారెక్టర్ ఏలివెట్ అయ్యేలా టీజర్ ను తీర్చి దిద్దడం జరిగింది.

అయితే ఈ చిత్రం నుండి విడుదల అయిన టీజర్ ప్రేక్షకులని విశేషం గా ఆకట్టుకుంటుంది. ఒక్క రోజులోనే మూడు మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం లో సిసిల్, ప్రగతి, బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ తో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :