చిత్రలహరి అప్పుడే సగం కంప్లీట్ అయ్యింది !

Published on Dec 12, 2018 8:44 am IST

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ నటిస్తున్న ‘చిత్రలహరి’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. దాదాపు షూటింగ్ మొదలై 24 రోజుల్లోనే ఈచిత్రం యొక్క షూటింగ్ 50 శాతం కంప్లీట్ అయ్యిందని సమాచారం. కిశోర్ తిరుమల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ ,చిత్ర పాత్రలో నటిస్తుండగా నివేత పేతురాజ్, లహరి పాత్రలో కనిపించనుంది. ట్రైయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సునీల్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో తేజు కొత్త లుక్ లో కనిపించనున్నాడు. ఇక ఈ చిత్ర విజయం తేజు తో పాటు , కిశోర్ తిరుమలకి అలాగే ఇటీవల రెండు వరుస పరాజయాలను చవి చూసిన నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కు చాలా కీలకం కానుంది.

సంబంధిత సమాచారం :