‘ఆచార్య’ 60 శాతం అందులోనే ఉంటుందట

Published on Apr 23, 2021 1:30 am IST

మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ‘ఆచార్య’ సినిమాలో చాలా ప్రత్యేకతలే ఉన్నాయి. అందులో మొదటిది సినిమా సెట్స్. ‘ధర్మస్థలి’ పేరుతో భారీ ఆలయం సెట్ వేశారు ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వరాజన్. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ సెట్ వేయడానికి రూ.20 కోట్లు ఖర్చు చేశారు. సినిమా బడ్జెట్లో ప్రైమ్ అమౌంట్ దీనికోసమే వెచ్చించారు. ఇంత ఖర్చుతో సెట్ వేయడానికి పెద్ద కారణమే ఉంది. కేవలం పాటలు, ఫైట్స్, రెండు మూడు సన్నివేశాల కోసమే ఈ సెట్ వేయలేదు. సినిమాలోని టాకీ పార్ట్ చాలావరకు ఇక్కడే జరుగుతుందట.

సుమారు 60 శాతం సినిమా ఈ ధర్మస్థలి సెట్లోనే జరుగుతుందట. ప్రధానంగా రామ్ చరణ్, చిరంజీవి కలిసి చేసిన సన్నివేశాలు సినిమాకే హైలెట్ అవుతాయని తెలుస్తోంది. చివరి దశ షూటింగ్ జరుగుతుండగా కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. దీంతో చిత్రీకరణ నిలిపివేశారు. మళ్ళీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఈ అడ్డంకుల మూలంగా సినిమా విడుదల కూడ వాయిదాపడినట్టే. త్వరలోనే ఈ వాయిదా గురించి అఫీషియల్ కన్ఫర్మేషన్ వెలువడే అవకాశం ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :