సెన్సార్ బోర్డు నుండి విజయ్ “లైగర్” కి 7 అభ్యంతరాలు!

సెన్సార్ బోర్డు నుండి విజయ్ “లైగర్” కి 7 అభ్యంతరాలు!

Published on Aug 18, 2022 1:12 PM IST


యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా లైగర్. సాలా క్రాస్ బ్రీడ్ ఉప శీర్షిక. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన ఈ చిత్రం లో విజయ్ మొదటి సారి గా బాక్సర్ గా నటిస్తున్నాడు. ఆగస్ట్ 25, 2022 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో భారీగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అందుకు సంబంధించిన ప్రమోషన్స్ ను సైతం వేగవంతం చేయడం జరిగింది.

అయితే ఈ చిత్రం ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. యూ/ఎ సర్టిఫికెట్ కూడా పొందడం జరిగింది. ఈ చిత్రం కి సెన్సార్ బోర్డు 7 అభ్యంతరాలను తెలిపింది. ఎఫ్ వర్డ్ మరియు ఆ సిగ్నల్ కి సంకేతం చూపించే వాటిపై రావడం జరిగింది. ఈ సినిమాలో విజయ్‌కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటించింది. మైక్ టైసన్, రమ్యకృష్ణ, విషు రెడ్డి తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు