“ఏమి బతుకు…ఏమి బతుకు” లిరికల్ సాంగ్ కి 8 మిలియన్ వ్యూస్!

Published on Oct 6, 2021 1:37 pm IST

నవీన్ చంద్ర, డాక్టర్ మోహన్, శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 1997. ఈ చిత్రానికి డాక్టర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నుండి ఏమి బతుకు ఏమి బతుకు అనే పాట విడుదల అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ పాట ఇటీవల విడుదల అయి సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతోంది. అంతేకాక ఈ పాట యూ ట్యూబ్ లో 8 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకోవడం విశేషం.

ఈ చిత్రానికి కోటి సంగీతం అందిస్తున్నారు. ఈ ఏమి బతుకు అనే పాటకు డాక్టర్ మోహన్ మరియు ఆదేష్ రవి లు లిరిక్స్ రాయగా, మంగ్లి పాడటం జరిగింది. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు సైతం సోషల్ మీడియాలో వైరల్ కాగా, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈశ్వర్ పార్వతి మూవీస్ పతాకంపై మీనాక్షి రమావత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ను వీలైన త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :