ఈ వారంలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న 9 సినిమాలు !

14th, November 2017 - 12:49:36 PM

రాబోయే శుక్రవారం సుమారు 9 సినిమాలకు కీలకమైన రోజుగా మారనుంది. ఒకేసారి ఈ 9 సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోడానికి థియేటర్లలోకి దిగుతున్నాయి. వీటిలో కార్తి, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ‘ఖాకి’ వంటి పెద్ద సినిమా ఉండగా సిద్దార్థ్ తమిళ అనువాద చిత్రం ‘గృహం’ కూడా ఉంది.

అలాగే శివబాలాజీ, రాజీవ్ కనకాల నటించిన ‘స్నేహమేరా జీవితం’, దాంతో పాటే ట్రైలర్స్ తో కొంత క్రేజ్ ను సొంతం చేసుకున్న ‘దేవి శ్రీ ప్రసాద్’, ‘ప్రేమ ఎంత మంధురం ప్రియురాలు అంత కఠినం’ కూడా విడుదలవుతున్నాయి. అంతేగాక ‘లవర్స్ క్లబ్’, మారుతి నిర్మాణంలో రూపొందిన ‘లండన్ బాబులు’ వంటివి కూడా అదే రోజున వస్తుండగా శ్రీకాంత్ ‘రా..రా’ కూడా ఈ శుక్రవారమే వస్తుందంటున్నారు కానీ ఇంకా ఫైనల్ కాలేదు.

ఇలా ఈ తొమ్మిది సినిమాలు ఒకే రోజున వస్తుండటంతో వీటిలో కొన్నిటికి ఖచ్చితంగా థియేటర్ల కొరత ఏర్పడే అవకాశాలున్నాయి. మరి ఈ సినిమాల్లో ఏవి ఎన్ని థియేటర్లు పొంది ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాలి.