తారక్ – త్రివిక్రమ్ సినిమాలో బెంచ్ మార్క్ రోల్ కు ఆమె.?

Published on Sep 20, 2020 9:03 am IST

బహుశా మన టాలీవుడ్ లో ఒక హీరోను ఎంతలా ఆరాధిస్తారో ఒక దర్శకునికి కూడా అంతే స్థాయిలో ఆదరణ పొందింది మాత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాసే అని చెప్పాలి. తన మాటల మాయాజాలంతో మంచి క్రేజ్ ను తెచ్చుకున్న ఈ దర్శకునికి అలాంటి మాటలను మరింత అద్భుతంగా పలికించి ఆకట్టుకోగలిగే నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అందుకే ఈ ఇద్దరి కాంబో అంటే మన టాలీవుడ్ లో ఒక మంచి క్రేజ్ ఏర్పడింది.

అలా వీరిద్దరి కాంబోలో వచ్చిన పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ “అరవింద సమేత వీర రాఘవ” మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దీనితో వీరి కాంబోలో మరో చిత్రాన్ని చూడాలని అంతా అనుకుంటున్నా తరుణంలో మరో ప్రాజెక్ట్ కూడా ఉన్నట్టుగా అధికారిక ప్రకటన వచ్చేసింది. అయితే త్రివిక్రమ్ సినిమాల్లో ఫీమేల్ బెంచ్ మార్క్ రోల్ ఈ మధ్యన కామన్ అయిపోయింది. అలా ఈ సినిమాలో కూడా ఒక రోల్ ఉందనున్నట్టు టాక్ వినిపిస్తుంది. అందుకు గాను త్రివిక్రమ్ లిస్ట్ లో పవర్ ఫుల్ నటి రమ్యకృష్ణ పేరు పరిశీలనలో ఉందట. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

More