‘సర్కారు’ తో “లైగర్” పోటీపై సరైన క్లారిటీ ఇదే.!

Published on Nov 30, 2021 10:06 am IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురాం పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న స్టైలిష్ మాస్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట”. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం మహేష్ కెరీర్ లో మంచి మోస్ట్ అవైటెడ్ సినిమాగా తెరకెక్కుతుంది. అయితే ఈ చిత్రం పలు కారణాల చేత సంక్రాంతి నుంచి తప్పుకొని ఏప్రిల్ 1న రిలీజ్ కి షిఫ్ట్ అయ్యిన సంగతి అందరికీ తెలిసిందే.

మరి ఈ డేట్ కే సరిగ్గా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ కాంబోలో ప్లాన్ చేసిన చిత్రం “లైగర్” చిత్రం కూడా వస్తుందని నిన్నటి నుంచి ఓ టాక్ వైరల్ అవుతుంది. అయితే ఈ టాక్ లో ఎలాంటి నిజం లేదని కన్ఫర్మ్ అయ్యింది. ఇండస్ట్రీ నుంచి సమాచారం ప్రకారం ఈ టాక్ పోటీ పూర్తి అవాస్తవం అట. రెండు సినిమాలు కూడా వేరే వేరుగానే ఇతర డేట్ లలో రిలీజ్ కానున్నాయి.

సంబంధిత సమాచారం :