దర్శకుడు శ్రీను వైట్ల – హీరో శర్వానంద్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ‘జార్జ్ క్రిష్’. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సెట్స్ వేశారని అక్కడే షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం శర్వానంద్ పై ‘జార్జ్ క్రిష్’ టైటిల్ సాంగ్ ను షూట్ చేస్తున్నారట. ఇక, శర్వానంద్ ఈ సినిమాలో జూనియర్ సైంటిస్ట్ గా కనిపించబోతున్నాడు. తన పాత్ర చుట్టూ సాగే డ్రామా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని.. సినిమాలో చాలా ఎపిసోడ్స్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంటాయని తెలుస్తోంది.
కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా మానస వారణాసి నటిస్తుంది. శర్వానంద్ – హీరోయిన్ మానస వారణాసి లవ్ స్టోరీ చాలా ట్రెండీగా ఉంటుందని.. చాలా ఫన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సాగుతుందని తెలుస్తోంది. అన్నట్టు ఈ సినిమాను సంక్రాంతి బరిలో దించాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని అనీల్ సుంకర నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాది జనవరి 14న విడుదల చేయబోతున్నారు.


