నైజాంలో జైలర్ 2 విధ్వంసానికి రంగం షురూ..!

నైజాంలో జైలర్ 2 విధ్వంసానికి రంగం షురూ..!

Published on Oct 11, 2026 1:00 AM IST

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జైలర్ 2’ అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

దసరా సీజన్ కలిసి రానుండటంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. విద్యాబాలన్ కీలక పాత్ర పోషిస్తుండగా, మోహన్‌లాల్, హృతిక్ రోషన్, శివరాజ్‌కుమార్, విజయ్ సేతుపతి వంటి స్టార్స్ ప్రత్యేక అతిథి పాత్రల్లో నటిస్తుండటం సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది.

​ఈ చిత్రానికి సంబంధించి నైజాం ప్రాంతంలో రేపు(అక్టోబర్ 11) ఉదయం 11:04 గంటలకు అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభంకానున్నాయి. మొదటగా డిస్ట్రిక్ట్ యాప్‌లో, ఆ తర్వాత బుక్‌మైషోలో టికెట్లు అందుబాటులో ఉంచనున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణలో సినిమా టికెట్ ధరలు సాధారణంగానే ఉండనున్నాయి. భారీ తారాగణం, పండగ సీజన్ అడ్వాంటేజ్ నేపథ్యంలో తెలుగు వెర్షన్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజా వార్తలు