బాక్సాఫీస్ : ‘కామ్రేడ్ కళ్యాణ్’కి 2వ రోజు ఆకట్టుకునే కలెక్షన్స్ !

బాక్సాఫీస్ : ‘కామ్రేడ్ కళ్యాణ్’కి 2వ రోజు ఆకట్టుకునే కలెక్షన్స్ !

Published on Oct 11, 2026 10:03 AM IST

శ్రీవిష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘కామ్రేడ్ కళ్యాణ్’. ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ఆడియన్స్ నుంచి ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలోని హాస్యం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ‘బుక్‌మైషో’లో ఈ సినిమా టికెట్ అమ్మకాలు ఆకట్టుకునేలా 61% వృద్ధిని నమోదు చేశాయి.

మొదటి రోజు 50.6 వేల టికెట్లు అమ్ముడవగా, రెండో రోజు ఆ సంఖ్య 81.5 వేలకు పెరిగింది. ఆదివారం మరియు దసరా సెలవులు కలిసి వస్తుండటంతో, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎంతమేర ప్రయోజనం పొందుతుందో వేచి చూడాలి. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో కోన వెంకట్ సమర్పణలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటించగా, రాధిక శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో కీలక పాత్రల్లో నటించారు.

తాజా వార్తలు