రణబాలి బడ్జెట్ అంతనా.. వారికే అంతా..?

రణబాలి బడ్జెట్ అంతనా.. వారికే అంతా..?

Published on Oct 10, 2026 10:00 PM IST

ఈ దసరా బరిలో నిలుస్తున్న మోస్ట్ అంటిసిపేటెడ్ సినిమాల్లో విజయ్ దేవరకొండ – రష్మిక జంటగా నటించిన ‘రణబాలి’ ఒకటి. పెళ్లి తర్వాత ఈ క్రేజీ కాంబోలో వస్తున్న మొదటి సినిమా కావడంతో పాటు, ‘టాక్సీవాలా’ తర్వాత రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ చేస్తున్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి.

పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రానికి సుమారు రూ.120 కోట్ల భారీ బడ్జెట్ ఖర్చయినట్లు సమాచారం. కేవలం స్టార్ క్యాస్టింగ్ రెమ్యునరేషన్‌కే రూ.60 కోట్లకు పైగా వెచ్చించగా, ఇందులో విజయ్, రష్మిక జోడీకి రూ.30 కోట్ల వరకు ముట్టినట్లు టాక్. అయితే, సినిమా ప్రారంభ దశలోనే నెట్‌ఫ్లిక్స్ సంస్థ నాన్-థియేట్రికల్ హక్కులను రూ.60 కోట్లకు దక్కించుకోవడంతో నిర్మాకులకు టెన్షన్ తప్పింది.

వాస్తవానికి రూ.80 కోట్ల లోపే పూర్తి కావాల్సిన బడ్జెట్ పెరిగినప్పటికీ, సగం రికవరీ ముందే అయిపోవడంతో మిగతా రూ.60 కోట్లను బాక్సాఫీస్ ద్వారా రాబట్టాల్సి ఉంది. దసరా సీజన్ అడ్వాంటేజ్ కలిసివచ్చి సినిమాకు మంచి టాక్ వస్తే ఇది పెద్ద విషయమే కాదని మైత్రీ మూవీ మేకర్స్ గట్టిగా నమ్ముతోంది. ‘ఇరుముడి’ విజయంతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన మైత్రీ సంస్థకు, ఈ ‘రణబాలి’ ఫలితం మరింత కీలకంగా మారనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు