లెజెండరీ దర్శకుడు మణిరత్నం వయసుతో సంబంధం లేకుండా అద్భుతమైన వేగంతో దూసుకుపోతున్నారు. విజయ్ సేతుపతి, సాయి పల్లవి జంటగా కోల్‌కతా నేపథ్యంలో సాగే రొమాంటిక్ డ్రామా ‘ఇంజి వెల్లమ్’ చిత్రాన్ని ఆయన ఇప్పటికే ప్రకటించారు.
జూలై 23న ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్, కేవలం మూడు నెలల వ్యవధిలోనే పూర్తి కావడం విశేషం. ఈ వయసులోనూ ఆయన చూపిస్తున్న పనితీరు, వేగం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. ప్రస్తుత రోజుల్లో చాలామంది యంగ్ డైరెక్టర్స్ అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేయలేక బడ్జెట్ తడిసి మోపెడవుతుంటే, మణిరత్నం మాత్రం పక్కా ప్లానింగ్‌తో సినిమాలను ముగిస్తున్నారు.
ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ఇంజి వెల్లమ్’ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా తగినంత సమయం దొరికింది. విజయ్ సేతుపతి, సాయి పల్లవి నటిస్తున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది.


