పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘హరి హర వీరమల్లు’. నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం జూన్ 12న, 2025న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నిర్మాత ఏ.ఎం. రత్నం గారు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు భరత్ భూషణ్ గారిని కలిసి, జూన్ 12న విడుదల కానున్న హరి హర వీరమల్లు చిత్రం కోసం ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక షోలకు టికెట్ ధర సవరణ మరియు ఆమోదం కోరుతూ అధికారికంగా అభ్యర్థన లేఖను సమర్పించడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శకత్వంలో ఈ అభ్యర్థన లేఖను సమర్పించారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ద్వారా సరైన ప్రోటోకాల్ ద్వారా అభ్యర్థనను పంపాలని పవన్ సూచించారు. కాగా డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ తో పాటు బాబీ డియోల్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు మరియు నోరా ఫతేహి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అన్నట్టు క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాలోని పలు సన్నివేశాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే


