గోపీచంద్ “సీటీమార్” నుంచి మెగా అప్డేట్ ఇదేనా.?

Published on Sep 5, 2021 12:54 pm IST


మ్యాచో మెన్ గోపీచంద్ హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా దర్శకుడు సంపత్ నంది తెరకెక్కించిన లేటెస్ట్ అండ్ అవైటెడ్ చిత్రం “సీటీమార్”. మంచి అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం వచ్చే 10వ తారీఖున రిలీజ్ కి రెడీగా ఉంది. అయితే ఈ చిత్రం నుంచి మేకర్స్ ఈ గ్యాప్ లో పలు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ నే ఇస్తున్నారు. మరి ఇప్పుడు తాజాగా మేకర్స్ మరో అప్డేట్ ఇచ్చారు.

రేపు ఉదయం 10 గంటలకి ఒక మెగా అప్డేట్ ని ఇవ్వనున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఇంకా ఈ సినిమా నుంచి జరగాల్సింది ప్రీ రిలీజ్ వేడుక ఒక్కటే.. మరి దీనికి మెగాస్టార్ చిరంజీవిని పిలుస్తున్నారేమో కావొచ్చు.. మరి మెగా అప్డేట్ అంటే ఇదే అయ్యే అవకాశం ఉంది. మరి అదేంటో తెలియాలి అంటే రేపటి వరకు ఆగాల్సిందే. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :