‘రాకా’లో ఎంట్రీ సీక్వెన్స్ పై కొత్త రూమర్ ?

‘రాకా’లో ఎంట్రీ సీక్వెన్స్ పై కొత్త రూమర్ ?

Published on Oct 12, 2026 9:00 AM IST

raaka

‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ’ కలయికలో రాబోతున్న సినిమా ‘రాకా’. ఐతే, ఇప్పుడు ఈ సినిమాలో వచ్చే అల్లు అర్జున్ ఎంట్రీ సీక్వెన్స్ పై ఓ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సీక్వెన్స్ కోసం బన్నీ రిస్కీ యాక్షన్ స్టంట్స్ ను ప్రాక్టీస్ చేస్తున్నాడని.. ఈ సీక్వెన్స్ లో బన్నీ లుక్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమాలో యాక్షన్ అద్భుతంగా ఉంటుందట. ఈ మూవీలో దీపికా పడుకోణె హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

అన్నట్టు ఈ సినిమాలో దీపికా పడుకోణెతో పాటు మృణాల్ ఠాకూర్ కూడా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే, జాన్వీ కపూర్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తోంది. కాగా మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఓ డాన్ చుట్టూ ఈ కథా నేపథ్యం సాగుతుందట. అన్నట్టు సన్ పిక్చర్స్ వారు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు.

తాజా వార్తలు