‘ఆదర్శ కుటుంబం’లో మరో సర్‌ప్రైజ్?

‘ఆదర్శ కుటుంబం’లో మరో సర్‌ప్రైజ్?

Published on Oct 12, 2026 8:04 AM IST

విక్టరీ వెంకటేష్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం’. ఐతే, ఈ సినిమాలో ఓ సర్ ప్రైజింగ్ ఎలిమెంట్ ఉందని.. అది ఓ గెస్ట్ రోల్ అని తెలుస్తోంది. మరి ఆ సర్ ప్రైజింగ్ ఎలిమెంట్, ఈ సినిమాకి ఏ రేంజ్ లో హెల్ప్ అవుతుందో చూడాలి. వెంకటేష్ ఫ్యాన్స్ మాత్రం కచ్చితంగా థ్రిల్ ఫీల్ అవుతారని అంటున్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్ ను దృష్టిలో పెట్టుకుని త్రివిక్రమ్ ఈ గెస్ట్ రోల్ ను పెట్టాడట. అన్నట్టు ఈ సినిమా అక్టోబర్ 9న విడుదల కావాల్సింది. కానీ రిలీజ్ పోస్ట్ ఫోన్ అయిన సంగతి తెలిసిందే.

ఇప్పుడున్న అప్ డేట్ ప్రకారం.. దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 30న విడుదల చేయాలి అనుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో నివేథా పేతురాజ్, నారా రోహిత్, పూజిత పొన్నాడ, రావు రమేష్ మరియు బ్రహ్మాజీ ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ పై భారీ అంచనాలు ఉన్నాయి.

తాజా వార్తలు