‘బ్రూస్ లీ’ కి మిస్.. ఇన్నాళ్ళకి రామ్ చరణ్ తో అనిరుద్!

‘బ్రూస్ లీ’ కి మిస్.. ఇన్నాళ్ళకి రామ్ చరణ్ తో అనిరుద్!

Published on Oct 12, 2026 12:00 AM IST

ప్రస్తుతం దక్షిణాది సినిమా దగ్గర మోస్ట్ హ్యాపెనింగ్ సంగీత దర్శకుల్లో అనిరుద్ కూడా టాప్ లో కొనసాగుతున్నాడు. అయితే అనిరుద్ మా హీరోకి సంగీతం అందించాలి అనే స్టాండర్డ్ ని తాను సెట్ చేసుకోగా ఇలా ఎన్నో ఏళ్ళు నుంచి ఎదురు చూస్తున్న కాంబినేషన్ ఇప్పుడు ఫైనల్ గా సెట్ అయ్యింది.

అదే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి అనిరుద్ సంగీతం అందించనుండడం. దర్శకుడు సుకుమార్ తో చేయనున్న సంగతి తెలిసిందే. అయితే రామ్ చరణ్ తో మాత్రం ఎప్పుడో అనిరుద్ చేయాల్సి ఉంది. చరణ్ యాక్షన్ సినిమా ‘బ్రూస్ లీ’ కి మొదట అనిరుద్ లాక్ అయ్యాడు కానీ తర్వాత థమన్ ట్రాక్ లోకి వచ్చాడు.

చరణ్ తో వర్క్ కోసం అనిరుద్ అప్పట్లో వేసిన ట్వీట్ కూడా ఇప్పటికీ ఉంటుంది. కానీ ఇప్పుడు వీరి కాంబినేషన్ అది కూడా బిగ్గెస్ట్ కాంబినేషన్ గా అవ్వాలని రాసి పెట్టుండేమో కానీ ఇప్పుడు ఫైనల్ అయ్యింది అనుకోవచ్చు. దాదాపు ఈ అనౌన్సమెంట్ దసరాతో క్లారిటీ రావచ్చని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు