పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న భారీ అంచనాలు ఉన్న సినిమా ‘స్పిరిట్’. ఈ పోలీస్ యాక్షన్ డ్రామా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కాగా ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే.. నవంబర్ మొదటి వారంలో ఓ ప్రత్యేక సెట్ లో ఈ సినిమా క్లైమాక్స్ ను ఘాట్ చేస్తారట. ఈ క్లైమాక్స్ కోసం కొన్ని స్పెషల్ యాక్షన్ సీన్స్ ను ప్లాన్ చేసారు. ప్రభాస్ పై ఈ సీన్స్ ను షూట్ చేస్తారట. కాగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఓ పవర్ ఫుల్ కాప్ స్టోరీగా రాబోతుంది.
ఇక ఈ సినిమాలో త్రుప్తి దిమ్రిని హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ లో ప్రభాస్ పక్కా వైల్డ్ అండ్ మాస్ అవతార్ లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రాన్ని టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించనున్నాయి. అన్నట్టు ‘స్పిరిట్’ మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. సందీప్ రెడ్డి వంగా నుంచి మరో వినూత్న సినిమా రాబోతుంది. మొత్తానికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.


