బాలయ్య నెక్స్ట్ లో పవర్ఫుల్ డైలాగ్ ఓ రేంజ్ లో వైరల్.!

బాలయ్య నెక్స్ట్ లో పవర్ఫుల్ డైలాగ్ ఓ రేంజ్ లో వైరల్.!

Published on Jan 2, 2022 11:00 AM IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ మాస్ చిత్రం “అఖండ” రిలీజ్ అయ్యి ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. తన హ్యాట్రి దర్శకుడు బోయపాటి శ్రీనుతో తీసిన ఈ భారీ సినిమా ఇప్పటికీ కూడా సాలిడ్ రన్ ని కనబరుస్తుంది.

ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య లైనప్ మరింత ఆసక్తిగా మారింది. మరో మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని తో బాలయ్య తన 107వ సినిమా చేస్తుండగా ఈ దర్శకుడు అలానే మాస్ మహారాజ్ రవితేజ బాలయ్య టాక్ షో అయినటువంటి “అన్ స్టాప్పబుల్” కి రాగా ఇందులో బాలయ్య గోపీచంద్ సినిమాలో ఉన్న ఓ పవర్ ఫుల్ డైలాగ్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.

అదేమిటంటే “రేయ్ రోడ్డు మీదకి జింక వచ్చిందనుకో ఎవడైనా హారన్ కొడతాడు అదే సింహం వచ్చిందంటే ఇంజిన్ కూడా ఆపేసి సైలెంట్గా కూర్చుంటాడు అక్కడ ఉన్నది సింహం రా రేయ్” అని ఉంటుందట. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో మరియు బాలయ్య అభిమానుల్లో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు