సరికొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న అల్లరి నరేష్ “ఆ ఒక్కటీ అడక్కు”

సరికొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న అల్లరి నరేష్ “ఆ ఒక్కటీ అడక్కు”

Published on Apr 15, 2024 5:08 PM IST

టాలీవుడ్ నటుడు అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ మల్లి అంకం దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం ఆ ఒక్కటీ అడక్కు. ఈ చిత్రం తో ఆడియెన్స్ ను మళ్ళీ తనదైన కామెడీ మార్క్ తో అలరించడానికి రెడీ అవుతున్నాడు. జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంను మొదట మార్చి 22, 2024న విడుదల చేయాలని ప్లాన్ చేసారు మేకర్స్. ఇప్పుడు కొత్త విడుదల తేదీని ఒక ఇంట్రెస్టింగ్ వీడియో తో అనౌన్స్ చేయడం జరిగింది.

మారింది రిలీజ్ డేట్ మాత్రమే, కామెడీ కాదు, కంటెంట్ కాదు అంటూ చెప్పుకొచ్చారు అల్లరి నరేష్. పెళ్లి కాక, రాత్రుళ్ళు నిద్ర పట్టక, ఎండకు మాడిపోయి, నలిగిపోతున్న బ్యాచిలర్స్ కోసం ఈ సినిమా చేసినట్లు తెలిపారు. ఈ సమ్మర్ లో అందరూ ధియేటర్ కి వచ్చి కు హ్యాపీ గా నవ్వుకుందాం అని అన్నారు. అయితే ఈ చిత్రాన్ని మే 3 వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ ఒక్కటీ అడక్కు చిత్రంలో జామీ లీవర్, కల్పలత, హరి తేజ, వెన్నెల కిషోర్, హర్ష చెముడు, అనీష్ కురువిల్లా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిలకా ప్రొడక్షన్స్ పతాకంపై రాజీవ్ చిలక నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు