రామ్ పోతినేని కి విలన్ గా ఆది పినిశెట్టి!

Published on Jul 19, 2021 1:31 pm IST

లింగుస్వామి దర్శకత్వంలో లో రామ్ పోతినేని హీరోగా, కృతి శెట్టి హీరోయిన్ గా ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి #RAPO19 వర్కింగ్ టైటిల్ గా కొనసాగుతుంది. అయితే ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది చిత్ర యూనిట్. ప్రస్తుతము ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం లో ఇప్పటికీ ప్రముఖ నటి నదియా సైతం నటిస్తుండటం విశేషం.

అయితే ఈ చిత్రం లో మరొక ఫేమస్ నటుడు నటించనున్నారు. రామ్ కి విలన్ గా ప్రముఖ నటుడు ఆది పినిశెట్టి నటించనున్నారు. అయితే ఆది రాక తో ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే రామ్ మరొక పక్క వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇస్మార్ట్ శంకర్, రెడ్ ల తర్వాత చేస్తున్న చిత్రం కావడం తో సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :