ఆది సాయి కుమార్ న్యూ మూవీ ‘టాప్ గేర్’ ఫస్ట్ లుక్ 3D మోషన్ పోస్టర్ విడుదల

Published on Sep 17, 2022 10:08 pm IST

ఫస్ట్ మూవీ ప్రేమ కావాలితో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ దక్కించుకున్న నటుడు యంగ్ సెన్సేషన్ ఆది సాయికుమార్. ఆ తరువాత లవ్లీ మూవీతో మంచి సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్న ఆది ప్రస్తుతం వరుసగా పలు సినిమాలు చేస్తూ కొనసాగుతున్నారు. లేటెస్ట్ గా ఆయన హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ టాప్ గేర్. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ టైటిల్ పోస్టర్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ రాగా నేడు ఈమూవీ యొక్క ఫస్ట్ లుక్ 3డి మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసింది యూనిట్.

ఈ పోస్టర్ లో డేరింగ్, డాషింగ్ ట్రెండీ లుక్ లో అదరగొట్టారు ఆది. ఈ మోషన్ పోస్టర్ ని బట్టి చూస్తే మంచి విభిన్నమైన పాయింట్ నే దర్శకుడు ఎంచుకున్నట్లు కొంత అర్ధం అవుతోంది. ఈ 3డి మోషన్ పోస్టర్ వీడియోలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ హైలైట్ అయ్యాయి. మొత్తంగా టాప్ గేర్ అనే టైటిల్ కి తగ్గట్లుగా హీరో ఆది సాయి కుమార్ తో ఈ పోస్టర్ డిజైన్ చేసిన విధానం ఈ వీడియోలో ప్రధానమైన ఆకర్షణగా నిలిచింది. ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ హంగులతో గ్రాండ్ గా ఈ టాప్ గేర్ సినిమా రాబోతోంది.

ఈ సినిమాలో రియా సుమన్ హీరోయిన్‌గా నటిస్తుండగా K. V. శ్రీధర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు గిరిధర్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తుండగా యువ దర్శకుడు శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీప్రవీణ్ పూడి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్ర, రేడియో మిర్చి హేమంత్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. కాగా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న టాప్ గేర్ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది.

సంబంధిత సమాచారం :