రీమేక్ తో అయినా ఆది హిట్ కొడతాడా ?
Published on Oct 16, 2017 9:30 pm IST

‘ప్రేమ కావాలి, సినిమాతో తెరంగేట్రం చేసిన ఆది ఫ‌స్ట్ సినిమాతోనే స‌క్సెస్ కొట్టాడు. అయితే.. ఆ త‌ర్వాత ఆయన చాలా సినిమాల్లో న‌టించిన‌ప్ప‌టికీ ఆశించిన విజయం అందలేదనే చెప్పాలి. రీసెంట్‌గా ‘శ‌మంత‌క‌మ‌ణి’ మూవీలో న‌టించిన ఈ యంగ్ హీరో ప్ర‌స్తుతం ‘నెక్స్ట్ నువ్వే’ సినిమాలో నటిస్తున్నాడు.
త‌మిళ్ సినిమా ‘యామిరుక్క భ‌య‌మే’ కు రీమేక్‌గా ఈ మూవీ రానుంది ‘నెక్స్ట్ నువ్వే’ తమిళ్ లో మంచి విజయం సాదించిన ఈ సినిమాపై ఆది హోప్స్ పెట్టుకున్నాడు. మరి ఈ సినిమాతో అయినా ఆది సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి. నటుడు ప్రభాకర్ మొదటిసారి ఈ సినిమాకోసం దర్శకత్వం వహించడం విశేషం. సాయి కార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు బాగున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ ౩ న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా.

 
Like us on Facebook