కమల్ డేట్ లోకి ధనుష్?

కమల్ డేట్ లోకి ధనుష్?

Published on May 7, 2024 8:59 AM IST


ప్రస్తుతం కోలీవుడ్ సినిమా నుంచి కూడా రానున్న రోజుల్లో మరిన్ని ఆసక్తికర ప్రాజెక్ట్ లు రానున్నాయి. మరి ఈ చిత్రాల్లో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా మావెరిక్ దర్శకుడు శంకర్ (Shankar) కాంబినేషన్ లో చేస్తున్న భారీ చిత్రం “ఇండియన్ 2” (Indian 2) కూడా ఒకటి. అయితే ఈ చిత్రం కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మొదటగా ఈ సినిమా ఈ జూన్ లో వస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.

కానీ అనుకోని విధంగా కొన్ని పనులు ఇంకా బ్యాలన్స్ ఉండడంతో సినిమా జూలై కి వెళ్లినట్టుగా పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా జూన్ లో 13న అలా వస్తుంది అని ఆ మధ్య స్ట్రాంగ్ బజ్ వినిపించింది. అయితే ఇప్పుడు ఎలాగో ఈ డేట్ లో సినిమా రావట్లేదు కాబట్టి ఈ డేట్ లో ధనుష్ రాబోతున్నట్టుగా బజ్ వినిపిస్తుంది.

ధనుష్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం “రాయణ్” (Raayan Movie) ని జూన్ లో ఫిక్స్ చేశారు. మరి ఈ సినిమా ఇండియన్ 2 డేట్ ని తీస్కొని రాబోతున్నట్టుగా వినిపిస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు