ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమాలకి బ్రేక్ ఇచ్చి ఎన్నికల హీట్ లో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక మరో పక్క ఇదే మూమెంట్ లో తన భారీ చిత్రం “హరిహర వీరమల్లు” నుంచి టీజర్ కూడా వచ్చింది. ఇలా సినిమా నుంచి కూడా పవన్ ఫ్యాన్స్ కి ట్రీట్ వస్తుండగా తాజాగా పవన్ కోసం అనేకమంది సినీ ప్రముఖులు అలానే మెగా ఫ్యామిలీ హీరోస్ కూడా తన నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు.
అయితే ‘తమ్ముడు’ పవన్ కళ్యాణ్ కోసం ‘అన్నయ్య’ చిరంజీవి కూడా వస్తారు అని పలు రూమర్స్ ఇది వరకే ఉన్నాయి. అయితే ఇప్పుడు చివరిగా చిరు కూడా పవన్ కోసం జాయిన్ కానున్నట్టుగా ఇప్పుడు బజ్ వినిపిస్తుంది. చిరు కూడా ప్రచారం కోసం వెళ్లే ఛాన్స్ ఉంది అని అటు వైపుగా కొన్ని పనులు ఉండగా వాటితో పాటుగా అలా వెళ్లి పవన్ కోసం ప్రచారం చేస్తారు అన్నట్టు ఇప్పుడు వినిపిస్తుంది. మరి బిగ్ మూమెంట్ కోసం అయితే మెగా అభిమానులు చాలా రోజుల నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి చూడాలి ఏమవుతుంది అనేది.