ఆ యువ దర్శకుడితో ఆది పినిశెట్టి !
Published on Oct 24, 2017 7:45 pm IST

తేజ దర్శకత్వంలో వచ్చిన ”ఒక విచిత్రం ‘ సినిమాతో తెలుగు సినిమాల్లోకి తెరంగేట్రం చేసి గుండెల్లో గోదారి, స‌రైనోడు, మ‌లుపు, నిన్ను కోరి స‌హా ప‌లు చిత్రాల్లో విభిన్న‌మైన పాత్ర‌ల‌తో మెప్పించిన యువ క‌థానాయ‌కుడు ఆది పినిశెట్టి, తాజాగా సోలో హీరోగా మరో చిత్రం చెయ్యడానికి సిద్దం అవుతున్నాడు. వివరాల్లోకి వెళ్ళితే…

నవదీప్ నటించిన ‘భమ్ భోలేనాద్’ చిత్రం తో దర్శకుడిగా పరిచయం అయిన కార్తీక్ వర్మ ఈ సినిమాను డైరెక్ట్ చెయ్యబోతున్నాడు. త్వరలో ఈ సినిమా ప్రారంభం కానుంది, ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంభందించి నటీనటుల ఎంపిక జరుగుతుంది. ఆది పినిశెట్టి ప్రస్తుతం చరణ్ ‘రంగస్థలం’ లో నటిస్తున్నాడు.

 
Like us on Facebook