నానక్రామ్ గూడాకి మారిన ఆగడు షూటింగ్

Published on Jan 26, 2014 9:30 pm IST

Aagadu-Movie
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘ఆగడు’ సినిమా ఈ సంవత్సరం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాల్లో ఒకటి. బ్లాక్ బస్టర్ మూవీ ‘దూకుడు’ విడుదలైన రెండున్నర సంవత్సరాలకు మహేష్ బాబు – శ్రీను వైట్ల కలిసి చేస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ లో తొలిసారిగా మహేష్ బాబు సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు సారధి స్టూడియోస్ లో కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేసారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నానాక్రామ్ గూడాలో ఈ మూవీ కోసం వేసిన స్పెషల్ సెట్ లో జరుగుతున్నాయి. మహేష్ బాబు అక్కడ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమాలో మహేష్ బాబు, తమన్నా పోలీస్ ఆఫీసర్స్ గా కనిపించనున్నారని సమాచారం.

దూకుడుకి మించి ఈ సినిమాలో కామెడీ ఉంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఫిబ్రవరి 9 వరకు హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతుంది. ఆ ఆతర్వాత గుజరాత్ కి షిఫ్ట్ అవుతుంది. 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ వారు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం :