నాగ్, నాని మల్టీ స్టారర్ కు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ !

నాగ్, నాని మల్టీ స్టారర్ కు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ !

Published on Feb 4, 2018 6:58 PM IST

సీనియర్ స్టార్ హీరో నాగార్జున, యంగ్ హీరో నాని కలిసి ఒక మల్టీ స్టారర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఫిబ్రవరి 24నుండి సినిమా మొదలుకానుంది. పూర్తిస్థాయి కామెడీ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేయనున్నారు. ప్రీ ప్రొడక్షన్లో భాగంగా నటీనటులను, సాంకేతిక నిపుణులను ఎంపిక చేస్తున్నారు.

ఈ ఎంపికలో భాగంగా సంగీత దర్శకుడిగా మణిశర్మను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం నాని చేస్తున్న ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రం చివరి దశ పనుల్లో ఉండగా ఆర్జీవీతో నాగార్జున చేస్తున్న పోలీస్ డ్రామా గత డిసెంబర్లో మొదలై కొంత మేర పూర్తైంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు