‘ఆచారి అమెరికా యాత్ర’ విడుదల వాయిదా !

‘దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం’ వంటి సినిమాలతో మంచి విజయం సాధించిన విష్ణు – జి. నాగేశ్వర రెడ్డి కాంబినేషన్ ఇప్పుడు హ్యట్రిక్ పై కన్నేసింది. తాజాగా వీరిద్దరు కలిసి చేస్తోన్న సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర’. పద్మజ పిక్చర్స్ బ్యానర్ పై కీర్తి చౌదరి నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను అలరించాయి.

జనవరి 26 న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదాపడిందని సమాచారం. టెక్నికల్ కారణాల వల్ల ఈ సినిమా అనుకున్న సమయానికి రాలేకపోతోంది. త్వరలో కొత్త విడుదల తేదీని ప్రకటించబోతున్నారు చిత్ర యూనిట్. త మన్ సంగీతం అందించిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. బ్రహ్మానందం , విష్ణు మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలెట్ కాబోతున్నాయి.