జపాన్లో “ఆచార్య” సందడి..పోస్టర్స్ వైరల్.!

Published on May 15, 2022 5:30 pm IST

ఈ ఏడాది మన టాలీవుడ్ నుంచి వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ మల్టీ స్టారర్ “ఆచార్య”. టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి మరియు తన కొడుకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా దర్శకుడు కొరటాల శివతో తెరకెక్కించిన ఈ చిత్రం అనుకోని రీతి ఫలితాన్ని దక్కించుకోవాల్సి వచ్చింది. దీనితో ఈ సినిమా ఈ మే 20నే అమేజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి వచ్చేస్తుంది.

అయితే ఇప్పుడు ఈ సినిమా జపాన్ దేశంలో రిలీజ్ అవుతుండడం ఆసక్తిగా మారింది. దీనికి సంబంధించి కూడా కొన్ని పోస్టర్స్ సోషల్ మీడియాలో మంచి వైరల్ అవుతున్నాయి. అక్కడి ఆడియెన్స్ ఫ్లేవర్ కి తగ్గట్టుగా కన్పిస్తున్న కామికల్ టైపు పోస్టర్స్ కనిపిస్తున్నాయి. మరి ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందివ్వగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు మరియు కొణిదెల ప్రొడక్షన్ హౌస్ వారు ఈ చిత్రాన్ని నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :