చిరు స్టెప్పులకు 25 మిలియన్ల వ్యూస్ కురిశాయి

Published on Apr 26, 2021 10:00 pm IST

దర్శకుడు కొరటాల శివ ‘ఆచార్య’ చిత్రాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి నుండి అభిమానులు, ప్రేక్షకులు ఏ అంశాలనైతే ఆశిస్తారో అవన్నీ ఉండేలా చూసుకుంటున్నారు. ముఖ్యంగా పాటలు, డ్యాన్సులు ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేశారు. ఇప్పటికే టీమ్ రిలీజ్ చేసిన ‘లాహే లాహే’ సాంగ్ మంచి హిట్టయింది. అందులో చిరు స్టెప్స్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. వింటేజ్ చిరు కనబడ్డారనే కాంప్లిమెంట్స్ కూడ వినబడ్డాయి.

ఈ పాట యూట్యూబ్ లో కూడ మంచి వ్యూస్ సాధించింది. ఇప్పటివరకు 25 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. మొత్తానికి పాట సినిమా విడుదలకు ముందే పెద్ద హిట్టైంది. ఇకపోతే ఈ చిత్రాన్ని మే 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు టీమ్. కానీ ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్స్ ఆగిపోయాయి. చివరి దశలో ఉన్న ‘ఆచార్య’ కూడ నిలిచిపోయింది. చిత్రీకరణలు రీస్టార్ట్ కావాలంటే ఇంకొక నెల రోజులు పట్టేలా ఉంది. ఈ లెక్కన మే నెలాఖరుకు మొదలైనా పూర్తి కావడానికి కనీసం 20 రోజులైనా పడుతుంది. అందుకే చిత్రాన్ని ఆగష్టు నెలలో రిలీజ్ చేయాలనే యోచనలో ఉన్నారట మెగా టీమ్.

సంబంధిత సమాచారం :