మాస్ డైరెక్టర్ తో యాక్షన్ హీరో.. నిజమేనా ?

Published on Jul 19, 2021 7:04 am IST

బాలయ్య బాబు ‘అఖండ’ సినిమా తర్వాత, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ హీరోతో సినిమా చేస్తాడు ? అంటూ ఇప్పటికే ఈ వార్త పై అనేక పుకార్లు వినిపించాయి. ఇప్పుడు కొత్తగా మరో రూమర్ వినిపిస్తోంది. బోయపాటి తన తరువాత సినిమాని యాక్షన్ హీరో విశాల్ తో ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఉంటుందట.

పైగా ఈ చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారని కూడా రూమర్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తకు సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఇప్పటికే బోయపాటి విశాల్ కోసం ఓ ఫుల్ యాక్షన్ స్క్రిప్టును సిద్ధం చేయించాడట. రచయిత ఎం రత్నం ఈ సినిమాకి కథ మాటలు రాశాడట. ఈ సినిమా పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా ఉండనుందట.

మొత్తానికి విశాల్ కి సరిపడే స్టోరీతో బోయపాటి ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నాడు అన్నమాట. విశాల్ – బోయపాటి కాంబినేషన్ అంటే భారీ అంచనాలు ఉండే అవకాశం ఉంది. మరి ఈ కలయికలో నిజంగానే సినిమా వస్తోందా ? చూడాలి.

సంబంధిత సమాచారం :