విశాల్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీ

Published on Nov 12, 2019 2:00 am IST

తెలుగు మరియు తమిళ పరిశ్రమలలో మార్కెట్ ఉన్న నటుడు విశాల్ నటించిన తాజా చిత్రం యాక్షన్.ఈనెల 15న రెండు భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. యాక్షన్ చిత్రం విశాల్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. దాదాపు 55కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కింది. ఉగ్ర చర్యల వలన అయినవారిని కోల్పోయిన కల్నల్ శుభాష్ పాత్రలో విశాల్ కనిపించనుండగా, మిల్కీ తమన్నా అండర్ కవర్ కాప్ రోల్ చేస్తున్నారు.

దర్శకుడు సుందర్.సి హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ రెండు భాషలలో మంచి రెస్పాన్స్ అందుకుంది. హిప్ హాప్ తమీజ్ యాక్షన్ మూవీకి స్వరాలు అందిస్తున్నారు. ఈ ఏడాది అయోగ్య చిత్రంతో మంచి హిట్ అందుకున్న విశాల్ యాక్షన్ మూవీతో మరో సూపర్ హిట్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.

సంబంధిత సమాచారం :

More