జోనర్ ఏదైనా యాక్షన్ హాలీవుడ్ రేంజ్ లో..!

Published on Jul 16, 2020 10:26 pm IST

ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా చిత్రాలు ప్రకటిస్తూ పోతున్నారు. బాహుబలి సిరీస్ తో బాలీవుడ్ రికార్డులు కొల్లగొట్టిన ప్రభాస్ సాహోతో మరో హిట్ నమోదు చేశాడు. సాహో విజయంతో ప్రభాస్ నిజంగా పాన్ ఇండియా స్టార్ అని నిరూపించుకున్నాడు. దీనితో ప్రభాస్ కి దేశవ్యాప్తంగా మార్కెట్ ఉందని తేలిపోయింది. అందుకే పాన్ ఇండియా సబ్జెక్టు అంటే అది ప్రభాస్ దగ్గరికి వస్తుంది. ప్రస్తుతం రాధా కృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ మూవీ చేస్తున్న ప్రభాస్ తన 21వ చిత్రం దర్శకుడు నాగ్ అశ్విన్ తో కమిటైన సంగతి తెలిసిందే.

ఈ మూవీ జోనర్ మరియు కథాంశంపై అనేక కథనాలు వెలువడినా దీనిపై స్పష్టమైన సమాచారం లేదు. ఐతే తాజా సమాచారం ప్రకారం జోనర్ ఏదైనా యాక్షన్ మాత్రం హాలీవుడ్ స్థాయిలో ఉంటుందట. దానికోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ని తీసుకోనున్నారని వినికిడి. బడ్జెట్ పరంగా కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ మూవీని తెరకెక్కించనున్నారు నిర్మాత అశ్వినీ దత్. మరి నాగ్ అశ్విన్ ప్రభాస్ ని తెరపై ఎలా ఆవిష్కరిస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :

More